
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
మొయినాబాద్ పరిధిలోని 'ది పెండెంట్' ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పార్టీ నిర్వహిస్తున్న నలుగురిపై ఎస్వోటీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు, దివ్వెల మాధురి సమీప బంధువు పార్థసారథి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్థసారథికి మొయినాబాద్ పోలీసులు కోర్టు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
కాగా, ఈనెల 12న 'ది పెండెంట్' ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్త్ డే పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, దవ్వెల మాధురి కూడా హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వోటీ టీమ్ ఫామ్ హౌస్పై రెయిడ్ చేసింది. పార్టీకి ఎలాంటి అనుమతి లేకపోవడంతో 7 విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కాను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు