
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పట్టులేకపోవడంతో బీఆర్ఎసన్ను దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేస్తుందని దాసోజు శ్రవన్ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కోర్టుకెళ్తామని హెచ్చరించారు.
ప్రజలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వార్డులను ఏర్పాటు చేశారని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆఫీసులో కూర్చొని 300 డివిజన్లు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎందుకంత తొందరపాటు అని ప్రశ్నించారు. ఈ వార్డుల విభజనపై రేపు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడతామని స్పష్టం చేశారు.
గతంలో మేడ్చల్ మొత్తం రూరల్గా ఉండేదని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. అనేక మంది ఉన్న పాలనను 16 మందికి కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉంటే కేవలం 16 కార్పొరేటర్లను చేశారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..