
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్బు ఓనర్లు గౌరవ్, సౌరబ్ లూత్రా ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 11న థాయ్ లాండ్లోని పుకెట్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని భారత్కు తీసుకొచ్చేందుకు దర్యాప్తు బృందం ప్రయత్నిస్తోంది.
రేపు ఉదయం వీరిని న్యూఢిల్లీకి తీసుకురానున్నట్లు తాజాగా తెలిసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే.. లూత్రా బ్రదర్స్ ను గోవా పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు సంబంధిత అధికారులు తాజాగా తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం గోవాకు తరలించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..