మరణించిన సర్పంచ్ అభ్యర్థినే ఓట్లేసి గెలిపించిన గ్రామస్తులు
వేములవాడ, 15 డిసెంబర్ (హి.స.) వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరామర్శించ
కేటీఆర్


వేములవాడ, 15 డిసెంబర్ (హి.స.)

వేములవాడ మండలం చింతలఠాణా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విషాదకర పరిస్థితుల్లో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి మురళి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం పరామర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ పాల్గొన్న అభ్యర్థి, ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజుల ముందు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

అయితే, గ్రామంలో ఆయన చేసిన సేవలు, బీఆర్ఎస్ పార్టీపై ఉన్న నమ్మకంతో చింతలఠాణా ప్రజలు మరణించిన ఆయనకే భారీ మెజారిటీతో ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించారు. ఈ నేపథ్యంలో చింతలఠాణాకు సోమవారం చేరుకున్న కేటీఆర్, మరణించిన సర్పంచ్ అభ్యర్థి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande