సొంత ఊరోళ్లే నా గుండెల మీద కొట్టారు.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎమోషనల్
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) నిన్న జరిగిన రెండవ దశ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోల్ అవ్వగా.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి


హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)

నిన్న జరిగిన రెండవ దశ పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 972 ఓట్లు పోల్ అవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి కి 490 ఓట్లు వచ్చాయి. దీంతో రేవతి 31 ఓట్లతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

అయితే,స్వగ్రామం రంగారెడ్డిగూడ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జడ్చర్ల నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేసుకుంటూ పోతున్నానని అన్నారు. సొంత ఊరు రంగారెడ్డిగూడ అని చెప్పి ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రూ.1.50 కోట్ల నిధులు తన చేతులతోనే మంజూరు చేశానని అన్నారు. కానీ, నన్ను అందరు కలిసి నమ్మించి సొంత ఊరోళ్లే సర్పంచ్ ఎన్నికల్లో తన గుండెల మీద కొట్టారని ఎమోషనల్ అయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande