మూడో దశలో కాంగ్రెస్ విజయం ఖాయం : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, 15 డిసెంబర్ (హి.స.) మూడో దశలో జరుగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పా
మంత్రి పొన్నం


హుస్నాబాద్, 15 డిసెంబర్ (హి.స.) మూడో దశలో జరుగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం హుస్నాబాద్ లో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయని స్పష్టం చేశారు.

సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు గ్రామాల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande