
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ నాలుగో రోజు ప్రారంభమైంది. సిట్ అధికారులు ఆయనను ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల సమాచారంపై దృష్టి సారించి విచారిస్తున్నారు. ముందు మూడు రోజుల్లో పలు ఆధారాలు ముందుంచి ప్రశ్నలు వేసినా, ప్రభాకర్ రావు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవటంతో విచారణ బలపడింది.
ఐక్లౌడ్, జీమెయిల్ డేటా మీద సిట్ ఫోకస్ప్రభాకర్ రావు వాడిన ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల్లో ఎరేజ్ చేసిన డేటా కోసం సిట్ యాపిల్, గూగుల్ సంస్థలకు లేఖలు రాసింది.ఈ సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక రహస్యాలను వెలుగు చేస్తుందని సిట్ ఆశిస్తోంది.అమెరికాలో ఉన్న ఒక డివైస్‌లో ప్రభాకర్ రావు ఐక్లౌడ్‌లో లాగిన్ అయినట్లు గుర్తించారు; ఆ డివైస్‌ను అక్కడే వదిలి వచ్చినట్లు తెలిసింది.సిట్ ఈ ఖాతాల్లోని లాగిన్ వివరాలు, ఎరేజ్ డేటా ఆధారంగా కేసు మరింత లోతుగా విచారణ చేస్తోంది. ప్రభాకర్ రావు నోరు తెరవకపోవటంతో, సాంకేతిక ఆధారాలపైనే ఆధారపడి సిట్ ముందుకు సాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..