
నిర్మల్, 15 డిసెంబర్ (హి.స.)
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ముత్యాల శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో శ్రీవేద పోటీ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించారు. ఆ ఒక్క ఓటే చివరికి ఫలితాన్ని మార్చిందని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..