అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్.. బిఆర్ఎస్ లో చేరిన 200 కుటుంబాల కార్యకర్తలు
మహబూబాబాద్, 15 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్పతండా గ్రామానికి చెందిన 200 కుటుంబాల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ కి షాక్


మహబూబాబాద్, 15 డిసెంబర్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుర్రప్పతండా గ్రామానికి చెందిన 200 కుటుంబాల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి విధానాలపై విసుకు చెందిన వారు బిఆర్ఎస్ పార్టీ లో కి రావడం శుభ పరిణామం అన్నారు. ఇప్పటికే జరిగిన రెండు విడతల పంచాయితీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికార పార్టీకి ధీటుగా బిఆర్ఎస్ పార్టీ నిలవడం జరిగిందని మిగిలిన మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఊహించిన దానికన్నా మెరుగైన ఫలితాలు పొందుతుందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande