SI భానుప్రకాశ్ రెడ్డిపై రెండు కేసులు నమోదు.. అదుపులోకి తీసుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు
హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఓ కేసులో రికవరీ బంగారం తాకట్టు పెట్టి, రివాల్వర్ సైతం పోగొట్టిన ఘటనలో ఎస్సై భానుప్రకాశ్ పై తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ అతడిని ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్
SI భానుప్రకాశ్ రెడ్డి


హైదరాబాద్, 15 డిసెంబర్ (హి.స.) బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఓ

కేసులో రికవరీ బంగారం తాకట్టు పెట్టి, రివాల్వర్ సైతం పోగొట్టిన ఘటనలో ఎస్సై భానుప్రకాశ్ పై తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇవాళ అతడిని ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 బ్యాచ్కు చెందిన ఎస్సై భానుప్రకాష్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొన్ని ఠాణాల్లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం అంబర్పేట్ పీఎస్ క్రైం ఎస్సైగా పని చేస్తున్నాడు.

కాగా, ఇటీవలే పీఎస్లో నమోదైన 4 తులాల బంగారం చోరీ కేసులో తానే ఎంక్వైరీ చేస్తూ బంగారాన్ని రికవరీ చేశాడు. కానీ, ఆ గోల్డ్ను బాధితులకు ఇవ్వకుండా బాధితులకు మాయమాటలు చెప్పి లోక్ అదాలత్లో కేసును క్లోజ్ చేయించాడు. అదేవిధంగా తన సర్వీసు రివాల్వర్ కూడా డబ్బుల కోసం రాయలసీలోని ఓ ముఠాలకు అమ్మేశాడనే ఆరోపణలు ఉన్నాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande