సీఎం చంద్రబాబు నాయుడు డిజిటల్.హెల్త్ పై.ఫోకస్
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.) వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు (మంగళవారం) సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల
సీఎం చంద్రబాబు నాయుడు డిజిటల్.హెల్త్ పై.ఫోకస్


అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)

వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు (మంగళవారం) సచివాలయంలో వైద్యారోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామన్నారు. రియల్ టైమ్‌లోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాల్లో పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande