మిస్టరీగానే పోలీస్ తుపాకీ మిస్సింగ్ కేసు
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) కరుడుగట్టిన క్రిమినల్స్ నోళ్ళను విప్పించిన పోలీసులు ఇప్పుడు పోలీసు తుపాకీ మిస్సింగ్ కేసులో అంబర్ పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ రెడ్డి నుంచి మాత్రం నిజం రాబట్టలేకపోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు విచారించిన పోలీసులకు ఎస్ఐ భా
పోలీస్ తుపాకీ


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) కరుడుగట్టిన క్రిమినల్స్ నోళ్ళను

విప్పించిన పోలీసులు ఇప్పుడు పోలీసు తుపాకీ మిస్సింగ్ కేసులో అంబర్ పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ రెడ్డి నుంచి మాత్రం నిజం రాబట్టలేకపోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు విచారించిన పోలీసులకు ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి నుంచి తుపాకీ ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయారు. నేను ఆ తుపాకీని స్టేషన్ లో నే మరిచిపోయా.. గుర్తు లేదనే సమాధానం మాత్రమే రావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని కీలక పోలీసు బాసు నుంచి టాస్క్ ఫోర్స్ తో పాటు ఇతర విభాగాల పోలీసు ఉన్నతాధికారులు విచారించిన భానుప్రకాష్ రెడ్డి పోలీసు పిస్తోలు అదృశ్యం గురించి ఏలాంటి ఆధారాన్ని రాబట్టలేకపోయారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande