
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో జనసేన పార్టీని అభివృద్ధి చేయాలని అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈనెల 18వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ఉమ్మడి10 జిల్లాల పార్టీ శ్రేణులు మరియు గ్రేటర్ హైదరాబాద్ పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఇన్చార్జిలు, POC సభ్యులు, వివిధ పదవులల్లో ఉన్న నాయకులు, మహిళలు, క్రియాశీలక వాలంటీర్లు వారి వారి నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు అందరూ పాల్గొనేలా బాధ్యత తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..