
చెన్నై17 డిసెంబర్ (హి.స.)
కేరళ శమరిమల అయ్యప్ప ఆలయం లో బంగారం చోరీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారడంతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు రావడంతో విచారణను ప్రత్యేక విచారణ బృందం సిట్ కు అప్పగించింది. శబరిమల ఆలయంలో జరిగిన బంగారం చోరీ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక SIT ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) శ్రీకుమార్ను అరెస్ట్ చేసింది. 2019లో శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడాలను తొలగించిన సమయంలో శ్రీకుమార్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ అపహరణకు సంబంధించి ఆయన పాత్రపై విచారణ చేపట్టిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి శ్రీకుమార్కు సమన్లు అందాయి. నేడు ఆయన కార్యాలయానికి చేరుకున్నాక, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణలో శ్రీ కుమార్ వెల్లడించిన సమాచారం, ఆధారాల ప్రాతిపదికన కేరళ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..