స్కూలుకు రాలేదని విద్యార్థుల చేతులు విరగ్గొట్టిన ప్రిన్సిపాల్
వేములవాడ, 17 డిసెంబర్ (హి.స.) స్కూల్ కి రాలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ ఇద్దరి విద్యార్థుల చేతుల విరగొట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓపెన్ ప్రైవేట్ పాఠశాల లో చదువుతున్న సాయి,
ప్రిన్సిపల్ దారుణం


వేములవాడ, 17 డిసెంబర్ (హి.స.)

స్కూల్ కి రాలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ ఇద్దరి విద్యార్థుల చేతుల విరగొట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఓపెన్ ప్రైవేట్ పాఠశాల లో చదువుతున్న సాయి, అయాన్ అనే 10 వ తరగతి విద్యార్థులు పలు కారణాల వల్ల స్కూల్ కి రాలేకపోయారు.

అయితే మాథ్స్ నోట్స్ కంప్లీట్ చేయలదన్న కారణం అడ్డం పెట్టుకొని హై స్కూల్ ప్రిన్సిపాల్ సంతోష్ విద్యార్థి అయాన్ తో పాటు మరో విద్యార్థి సాయిని దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో ఒక విద్యార్థి చేయి విరగగా మరో విద్యార్థి సాయి చేతి వేలు విరిగింది. ఈ ఘటన పై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీయడంతో, యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు జరిపి విషయాన్ని బయటకి పొక్కకుండా చూడాలని కోరినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande