మాజీ టాస్క్ ఫోర్స్ DCP రాధాకిషన్ రావుకు షాక్.. తాజాగా మరో ఛార్జ్ షీటు దాఖలు
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ కేసులో పలువురు సీనియర్ పోలీసు అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీ రాజకీయ
డిసిపి రాధాకృష్ణారావు


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో

జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టించింది. ఈ కేసులో పలువురు సీనియర్ పోలీసు అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోన్ ట్యాపింగ్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కు మరో బిగ్ షాక్ తగిలింది.

హైదరాబాద్ నగర పరిధిలోని సనత్నగర్ లో తమ ఫ్లాట్ను బెదిరించి దౌర్జన్యంగా రాయించుకున్నారని రాధాకిషన్ రావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టిన సనత్నగర్ పోలీసులు ఇవాళ కూకట్పల్లి కోర్టులో ఛార్జ్ షీటు దాఖలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande