బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 21కి వాయిదా..
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీ
బిఆర్ఎస్ మీటింగ్


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

ఈ నెల 19న నిర్వహించాల్సిన

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గనడం కోసం వాయిదా వేశారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని పార్టీ స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని పేర్కొంది. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande