
న్యూఢిల్లీ, 16 డిసెంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్నారు. ఇవాళ ఆయన కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని వినతి అందజేశారు. రాష్ట్రంలో 105 YIIRSలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం భేటీ అయ్యారు. హైదరాబాదు కు ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు.
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా 9 కేంద్రీయ విద్యాలయాలను, జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు