అనారోగ్యంతో సీపీఐ సీనియర్ నేత లక్ష్మయ్య మృతి..
సూర్యాపేట, 16 డిసెంబర్ (హి.స.) కమ్యూనిస్టు రాజకీయాల్లో మరో కురువృద్ధుడు అస్తమించారు. నాలుగున్నర దశాబ్దాల కాలం పాటు కమ్యూనిస్టు రాజకీయాల్లో ఆరితేరిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య (79) మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్ప
సిపిఐ లీడర్ మృతి


సూర్యాపేట, 16 డిసెంబర్ (హి.స.)

కమ్యూనిస్టు రాజకీయాల్లో మరో

కురువృద్ధుడు అస్తమించారు. నాలుగున్నర దశాబ్దాల కాలం పాటు కమ్యూనిస్టు రాజకీయాల్లో ఆరితేరిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య (79) మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ముకుందాపురం గ్రామంలో 1946లో మూరగుండ్ల వెంకటయ్య-పిచ్చమ్మ దంపతులకు జన్మించిన ఆయన దీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీలో ఉంటూ అనేక ప్రజా ఉద్యమాలలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతిపై పలువురు కమ్యూనిస్టు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande