
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో
గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అనుమతి ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 5.375 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.16.125 కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన నేడు జరిగిన ఈఎస్ఐసీ 197వ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇది తెలంగాణ కార్మికులకు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు