
తెలంగాణ, 16 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో చలి తీవ్ర స్థాయికి
చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తాజాగా బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో తీవ్ర పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా.. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉందని వివరించింది. అన్ని జిల్లాలలో కోల్డ్ వేవ్ కొనసాగుతుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఉదయపు సమయాల్లో హైవేలపై ప్రయాణించే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు