పోలీసుల్లో నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యం: సైబరాబాద్ సీపీ
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) పోలీస్ అధికారులలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు, డ్యూటీ మీట్లు ఎంతగానో దోహదపడతాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ గ్రౌండ్లో మంగళ
సైబరాబాద్ సీపీ


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) పోలీస్ అధికారులలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు, డ్యూటీ మీట్లు ఎంతగానో దోహదపడతాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ గ్రౌండ్లో మంగళవారం నుండి ప్రారంభమైన పోలీస్ వార్షిక క్రీడలు, డ్యూటీ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్యూటీ మీట్లో భాగంగా సాంకేతిక, చట్టపరమైన అంశాలను సమన్వయం చేస్తూ పరీక్షలు నిర్వహించడం వల్ల అధికారుల పనితీరు మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పోలీసుల పని ఒత్తిడిని తగ్గించి, వారిలో శారీరక దృఢత్వాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ఈ క్రీడలు ఒక వేదికగా నిలుస్తాయన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande