
కోల్కత్తా, 16 డిసెంబర్ (హి.స.)
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి
కోల్కతా పర్యటన సందర్భంగా స్టేడియంలో అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర క్రీడల మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు.
స్టేడియంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరగాలనే ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీనామా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు