జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై ఏఐఎంఐఎం ఆగ్రహం
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) నేడు జరుగుతున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సాధారణ సభలో ప్రతిపాదిత వార్డుల డీలిమిటేషన్ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా వార్డుల సంఖ్యను 300కు పెంచే ప్రతిపాదనప
ఏఐఎంఐఎం


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) నేడు జరుగుతున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

(జీహెచ్ఎంసీ) సాధారణ సభలో ప్రతిపాదిత వార్డుల డీలిమిటేషన్ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా వార్డుల సంఖ్యను 300కు పెంచే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుల విభజన వెనుక ప్రజాప్రయోజనం కంటే రాజకీయ లాభనష్టాలే ప్రధానంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం ను బలహీనపర్చేందుకు, పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ చేపట్టారని బలాలా విమర్శించారు.

డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరిగే ఎలాంటి చర్యలనైనా ఏఐఎంఐఎం సహించదని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande