
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
ఔటర్ రింగు రోడ్డు సరిహద్దుగా
జీహెచ్ఎంసీని 300 వార్డులకు విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త మ్యాప్ను విడుదల చేసింది. ఇవాళ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది.
చర్చ సందర్భంగా మేయర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. వార్డులు డీలిమిటేషన్ గురించి తనకే తెలియదని మేయర్ విజయలక్ష్మి చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..