
రంగారెడ్డి, 16 డిసెంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలం నాగారం భూముల విషయంలో ఐఏఎస్, ఐపీఎస్లకు భారీ ఊరట లభించింది. ఇవి భూదాన్ భూములుగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. నాగారం భూములు భూదాన్ భూములుగా పేర్కొంటూ బిర్లా మల్లేశ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని పిటిషన్లో ఆరోపించగా విచారణ జరిపిన హైకోర్టు ఐఏఎస్, ఐపీఎస్లకు అనుకూలంగా గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే మల్లేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఈ పిటిషన్ ను ప్రాథమిక స్థాయిలోనే కొట్టివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు