
కామారెడ్డి, 16 డిసెంబర్ (హి.స.)
నూతనంగా ఎన్నికైన సర్పంచులు
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ క్యాంపు కార్యాలయంలో ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్ లకు శాలువాలు పూలమాలలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజల విశ్వాసంతో వచ్చిన ఈ విజయం కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజా మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రెస్ పాలనలో గ్రామాలకు మరింత న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు