నిధులు మీ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మాస్ వార్నింగ్
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామపంచాయితీలకు నిధులు నిలిపివేస్తానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాజ్యాం
కేటీఆర్


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్

అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామపంచాయితీలకు నిధులు నిలిపివేస్తానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు నిధులు వస్తాయని, రాజ్యాంగాన్ని కాదని ఏ ఎమ్మెల్యే నిధులు ఆపలేడని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిధులు వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని, అవి ప్రభుత్వ నిధులని, ప్రజలకు హక్కుగా రావాల్సిన నిధులు ఆపుతాం అంటే కుదరదని మండిపడ్డారు.

బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన గ్రామ పంచాయితీలకు నిధులు ఎలా ఆపుతారో మేమూ చూస్తామని కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande