కాంగ్దాడికి ప్రతిదాడి తప్పదు: కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను కేటీఆర్ మంగళ
కేటీఆర్


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా.. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు.. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande