అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్: మంత్రి సీతక్క
ములుగు, 16 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో రెండు విడుతలుగా 8 వేల 566 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయని, బుధవారం చివరి విడత ఎన్నికలు జరగనున్నాయని మంత్రి సీతక్క అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం చె
మంత్రి సీతక్క


ములుగు, 16 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో రెండు విడుతలుగా 8 వేల 566 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయని, బుధవారం చివరి విడత ఎన్నికలు జరగనున్నాయని మంత్రి సీతక్క అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, రానున్న రోజులలో పార్టీ మనుగడే కరువు అవుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ..

గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ ములుగు నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande