ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర.. కేంద్రంపై మంత్రి పొన్నం ఫైర్
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని.. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోట్గార్ అండ్ అజీవిక మి
మంత్రి పొన్నం


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర

ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని.. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోట్గార్ అండ్ అజీవిక మిషన్గా పేరు మార్చి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ అయిన ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర చేస్తోందన్నారు.

ఇప్పటికే ఉపాధి హామీకి నిధుల్లో కోతలు విధిస్తూ కుంటిసాకులు చెబుతున్నారని మంత్రి పొన్నం అన్నారు. గాంధీ పేరు తొలగించడం ద్వారా ఆయనను అవమానిస్తున్నారని ఆరోపించారు. అందుకే వారికి గాడ్సే వారసులుగా పేరు ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande