
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
యూరియా కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ తీసుకొస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో చిట్చాట్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు వేదికల ద్వారా మొబైల్ యాప్ పై రైతుల అభిప్రాయం సేకరించామని అన్నారు. మొబైల్ యాప్పై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు. పత్తి అమ్మకం కోసం రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, అది 100 శాతం సక్సెస్ అయిందని చెప్పారు.
రైతులకు స్లాట్ బుకింగ్ సహాయం కోసం రైతు వేదికల వద్ద AEOలు అందుబాటులో ఉంటారని, రాజకీయ పబ్బం కోసం కొంత మంది వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాను బ్లాక్లో పరిశ్రమల అవసరాలకు తరలిస్తున్నారు అనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకు అందే విధంగా మొబైల్ యాప్ పనిచేస్తుందని రైతన్నలకు గ్నుడ్న్యూస్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు