
ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసు (National Herald case)లో ఈడీ తమ దర్యాప్తును కొనసాగించొచ్చని న్యాయస్థానం తెలిపింది.
ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు జరిపి ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు న్యాయస్థానం విచారణ సందర్భంగా వెల్లడించింది. చట్టప్రకారం దీన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే దిల్లీ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అలాంటప్పుడు ఈడీ (ED) ఛార్జ్‌షీట్ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ