
కోల్‌కతా,17 డిసెంబర్ (హి.స. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్‌లో దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటంపై టీఎంసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 45 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించడంతో ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ప్రతి ఓటర్ పేరును ఇంటింటికి వెళ్లి మళ్లీ పరిశీలించాలని పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం భవానీపూర్ ప్రాంతంలో స్థానిక పార్టీ నాయకులతో టీఎంసీ సమావేశం నిర్వహించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ