
రామగుండం, 16 డిసెంబర్ (హి.స.)
రామగుండం నియోజకవర్గంలోని
దృష్టికి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తీరుస్తానని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. మంగళవారం వేకువ జామున ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. ప్రజలు చెప్తున్న సమస్యలను వింటూ, వార్డులలో మౌలిక వసతులను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన ప్రజా పాలన ఇంటింటికి, గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు