కన్నవారిని రోడ్డున వదిలేస్తే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా చాలా మంది ఫిర్యాదు దారులు తనను కలుస్తున్నారని చెప్పారు. రకరకాల కారణాలతో తల్లిదండ్రులను వదిలే
సజ్జనార్


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

తల్లిదండ్రులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలంగా చాలా మంది ఫిర్యాదు దారులు తనను కలుస్తున్నారని చెప్పారు. రకరకాల కారణాలతో తల్లిదండ్రులను వదిలేస్తున్నారని అన్నారు. కొన్ని కేసులు చాలా బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆస్తులు అన్నీ రాయించుకుని రోడ్డుపై వదిలేశారని చాలామంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీసం ధర్మం అని అన్నారు. మీరు కూడా ఒకరోజు వృద్ధులు అవుతారని అప్పుడు మీ పిల్లలు కూడా అలానే ట్రీట్ చేస్తారని అన్నారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande