
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్
(CISF) సిబ్బంది, ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో ప్రయాణించిన రమేష్ (42) అనే వ్యక్తి ఎయిర్ హోస్టెస్ను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆమె ఫిర్యాదు మేరకు రమేష్ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్టు పీఎస్లో అప్పగించారు.
ఇక మరో ఘటనలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో ఇండిగో విమానంలో ప్రయాణించిన నాజర్ (35) అనే వ్యక్తి మత్తులో ఉండి ఎయిర్ హోస్టెస్ను అసభ్యకరంగా మాటలతో వేధించాడు. అనంతరం ఆమెపై చేతులు వేయడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అడ్డుకోవడంతో ఇతర ప్రయాణికులతో అతడు గొడవ పడ్డాడు. విమానం దిగగానే అతడిని ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..