ఎన్నికల నేపథ్యంలో ఆ రెండు రోజులు సెలవు.. సూర్యాపేట జిల్లా కలెక్టర్
సూర్యాపేట, 16 డిసెంబర్ (హి.స.) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 3 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలకు వినియోగించుకునే సంస్థలకు ఈ నెల 16న, అలాగే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 17న ఆయా మండలాల పరిధి
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 16 డిసెంబర్ (హి.స.)

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల

మేరకు 3 వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికలకు వినియోగించుకునే సంస్థలకు ఈ నెల 16న, అలాగే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 17న ఆయా మండలాల పరిధిలో స్థానిక సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకొనే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు ఈ నెల 16 న స్థానిక సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అలాగే పోలింగ్ రోజు (17.12.2025)న నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్' మరియు 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్' ప్రకారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande