
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం
ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి దాదాపు 200 టీఎంసీల నీటిని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమలసాగర్కు తరలించేందుకు పొలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్ (DPR) తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ తాజాగా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు