
కామారెడ్డి, 16 డిసెంబర్ (హి.స.) కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరిస్తుందని తెలియడంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. గొర్రెలు, మేకలు, లేగ దూడలు, ఆవులపై వరుసగా దాడులు చేస్తుండడం ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని మాచారెడ్డి, ఆ తర్వాత దోమకొండ మండలం అంబర్ పేట మాందాపూర్ గ్రామాల్లో పులి సంచరిస్తుందని గుర్తించగా, తాజాగా మంగళవారం భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో పులి దాడి చేయగా ఆవు మరణించింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి పాదముద్రలను గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు