
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
కోఠి మహిళా యూనివర్సిటీ మెస్
ఇంఛార్జ్ వినోద్ ను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్నాడు అంటూ వినోద్ పై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ లో చదువుతున్న విద్యార్థినులే షీ టీమ్కు ఫోన్ చేసి వినోద్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన ఇబ్బందికరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి
దిగిన షీ టీమ్ ప్రిన్సిపాల్ను ఘటనపై ఆరా తీసింది. అయితే మొదట ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ తమకు వినోద్ పై విద్యార్థినుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. విద్యార్థినులను సంప్రదించినా వాళ్లు అతడి గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారని అన్నారు. కానీ నేడు వినోద్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..