
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)
భూ కబ్జాలపై ఇటీవల కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
పై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. నేపథ్యంలోనే పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస ప్రాంతాల ముసుగులో మౌలిక వసతుల కల్పనకు వాడుతున్న రూ.4 వేల కోట్ల భూములపై రేవంత్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అసలు కూకట్పల్లి పరిధిలోని సర్వే నెం.376లో అసలు ఏం జరిగిందో లెక్కలు తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.
కాగా.. ఎమ్మెల్సీ కవిత, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఈ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఐడీపీఎల్ (IDPL) పరిశ్రమకు చెందిన విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించి, వివిధ శాఖల అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా మేడ్చల్ కలెక్టర్ గుర్తించారు. ఈ
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..