విజయ్ దివస్ సందర్భంగా గవర్నర్, డిప్యూటీ సీఎం బట్టి నివాళులు
హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.) విజయ్ దివస్ సందర్భంగా నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి నివాళులర్పించారు. అనంతరం త్రివిధ దళాల
విజయ్ దివస్


హైదరాబాద్, 16 డిసెంబర్ (హి.స.)

విజయ్ దివస్ సందర్భంగా నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి నివాళులర్పించారు. అనంతరం త్రివిధ దళాల అధికారులు గౌరవ వందనం చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. 1971లో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వమైన ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ విముక్తి సాధించిన రోజు విజయ్ దివస్ చరిత్రలో గర్వించదగిన రోజు అని తెలిపారు. యుద్ధ సమయంలో దేశ ఔన్నత్యాన్ని కాపాడిన అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి, సైనిక నాయకులకు, అమర జవాన్లందరికీ వందనాలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande