విశాఖ. కేంద్రానికి కేంద్రంగా మారుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు
విశాఖపట్నం, 16 డిసెంబర్ (హి.స.) , విశాఖ ప్రపంచానికే కేంద్రంగా తయారవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ బాగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. మనదేశంలో ఏవియేషన్ అభివృద్ధి చెందుతుందంటే ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపా
విశాఖ. కేంద్రానికి కేంద్రంగా మారుతుందని మంత్రి రామ్మోహన్  నాయుడు అన్నారు


విశాఖపట్నం, 16 డిసెంబర్ (హి.స.)

, విశాఖ ప్రపంచానికే కేంద్రంగా తయారవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం ఏవియేషన్ బాగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. మనదేశంలో ఏవియేషన్ అభివృద్ధి చెందుతుందంటే ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలిపారు. ప్రతి ఏటా 12 శాతం గ్రోత్ రేట్‌తో ఏవియేషన్ రంగం ఎదుగుతోందన్నారు. సాధారణ వ్యక్తి విమానంలో ప్రయాణం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య ఎనిమిది వేలకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande