'న్యాయమే గెలిచింది'.. నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయ దురుద్దేశంతోనే వేశారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదని 19
Kharge


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా

గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయ దురుద్దేశంతోనే వేశారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇప్పటిది కాదని 1938లో దేశస్వాతంత్య్రం కోసం పుట్టిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులే ఈ పత్రికను ప్రారంభించారని అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీలలను వాడుకుని కాంగ్రెస్ నేతలపై వేధింపులకు గురి చేస్తోందన్నారు. గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు ఈ కేసు పెట్టారని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande