
కోల్కత్తా, 17 డిసెంబర్ (హి.స.)
'మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం' పేరును కేంద్ర ప్రభుత్వం 'పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన' గా మార్చడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అగ్రనేత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జి మేనల్లుడు అభిషేక్ బెనర్జి తప్పుపట్టాడు. పేరు మార్చడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి 'మహాత్మా' అనే బిరుదు ఇచ్చారని, అభిషేక్ వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర మార్చడాన్ని బట్టి బీజేపీ మహాత్ముడికి ఇచ్చే విలువ ఏ పాటిదో స్పష్టమవుతున్నదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..