
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)
బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత
ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత హై కమిషన్ కార్యాలయానికి సరైన భద్రత కల్పించడంలో వైఫల్యం, అక్కడ చోటుచేసుకున్న నిరసనల నేపథ్యంలో, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. భారత దౌత్యవేత్తలు, కార్యాలయ సిబ్బంది భద్రత విషయంలో తమకు ఉన్న తీవ్ర ఆందోళనలను భారత్ ఈ సందర్భంగా వెల్లడించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత స్థానిక ప్రభుత్వంపై ఉంటుందని భారత్ స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్లో లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారత వ్యతిరేక నిరసనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భద్రతా అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు