భారత ఆతిథ్యానికి మెస్సీ ఫిదా.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) గోట్ టూర్ ముగించుకుని ప్రముఖ ఫుట్ బాల్ క్రీడారుడు మెస్సీ స్వదేశానికి బయలుదేరాడు. మూడు రోజుల పాటు మెస్సీ భారత్ లోని కోల్ కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పర్యటించి సందడి చేశారు. ఇక పర్యటన ముగియడంతో సోషల్ మీడియ
మెస్సి


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

గోట్ టూర్ ముగించుకుని ప్రముఖ

ఫుట్ బాల్ క్రీడారుడు మెస్సీ స్వదేశానికి బయలుదేరాడు. మూడు రోజుల పాటు మెస్సీ భారత్ లోని కోల్ కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పర్యటించి సందడి చేశారు. ఇక పర్యటన ముగియడంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. భారత్ ఆతిథ్యానికి, అభిమానాల ప్రేమకు కృతజ్ఞతలు అని మెస్సీ పేర్కొన్నారు. భారత దేశంలో ఫుట్ బాల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే మెస్సీ గోట్ టూర్ ఇండియాలో ఎంతో సందడిగా జరిగింది.

కోల్ కతాలో ఏర్పాట్ల విషయంలో కాస్త లోపాలు ఉన్నా తరువాత ఎక్కడా అలాంటివి రిపీట్ అవ్వకుండా ప్రభుత్వాలు, అధికారిక యంత్రాంగం జాగ్రత్త పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande