మరో నాలుగు రోజులు రాష్ట్రంపై పులి పంజా.. హైదరాబాద్లో చుక్కలే
తెలంగాణ, 17 డిసెంబర్ (హి.స.) గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. కాగా మరో నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో
చలిపులి


తెలంగాణ, 17 డిసెంబర్ (హి.స.)

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఊష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. కాగా మరో నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో కోల్డ్ వేవ్ ఉంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6 నుండి 7 డిగ్రీలకు పడిపోతాయని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో 7 నుండి 9 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande