
తిరుమల 17 డిసెంబర్ (హి.స.), తిరుమలపై ఒత్తిడి తగ్గించే ఆలోచనతో తిరుపతిలోని అలిపిరి వద్ద 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ను నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
టీటీడీ శిల్ప కళాశాల ప్రాంతంలో ఈ టౌన్‌షి్‌పను నిర్మిస్తామని, శిల్పకళాశాలను మరో ప్రదేశానికి తరలిస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కనీస బస, అన్నదానం, పార్కింగ్ వంటి కొన్ని సౌకర్యాలు ఇక్కడ ఉంటాయన్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్ల మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇప్పటికే ఆ ఆస్పత్రికి దాదాపు రూ.230 కోట్లు కేటాయించగా, అందులో అవసరం లేని కొన్ని నిర్మాణాలకు సంబంధించిన టెండర్లను రద్దు చేశామన్నారు. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ